రెండోసారి ఆర్థికమంత్రిగా నిర్మల.. తొలి మహిళగా రికార్డ్

61చూసినవారు
రెండోసారి ఆర్థికమంత్రిగా నిర్మల.. తొలి మహిళగా రికార్డ్
కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా రెండోసారి నియమితులైన నిర్మలా సీతారామన్‌ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చేనెల సమర్పించే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కనున్నారు.