ఆర్మూర్: తక్కువ నీటితో వరి సాగు చేసే విధానాలపై అవగాహన

68చూసినవారు
ఆర్మూర్: తక్కువ నీటితో వరి సాగు చేసే విధానాలపై అవగాహన
తక్కువ నీటితో వరి సాగు చేసే విధానాలపై, ఎరువు, విత్తనాలు ఒకేసారి వేసుకునే సీడ్ కమ్ ఫెర్టి డ్రిల్ యంత్రంతో పొడి భూమిలో వరి పండించే విధానాలపై అవగాహన కల్పించారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జీకేఆర్ఎస్ కన్వెన్షన్ హాల్లో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ విధానంలో వరి సాగు చేయడం వల్ల సుమారు 15 నుంచి 20% నీటిని ఆదాచేయవచ్చని, కూలీల కొరతను అధిగమించవచ్చని అన్నారు.