Oct 06, 2024, 08:10 IST/ఆర్మూర్
ఆర్మూర్
ఇదీ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం
Oct 06, 2024, 08:10 IST
సిరికొండ మండలం రూప్లా తండాకు చెందిన భానావత్ మంజుల గర్భవతి. 9 నెలలు నిండటంతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో స్కాన్ తీపించుకుని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా, శిశువు గుండె చప్పుడు తక్కువగా ఉందని డాక్టర్ చెప్పింది. శనివారం మంజుల అస్వస్థతకు గురి కావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా 3 రోజుల క్రితమే శిశువు మరణించినట్లు తెలిపారు. బాధితులు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ను నిలదీయగా, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.