బోధన్: ఎరాజ్ పల్లి దేవిమాత మండపం వద్ద అన్నదానం

62చూసినవారు
బోధన్: ఎరాజ్ పల్లి దేవిమాత మండపం వద్ద అన్నదానం
బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో కొలువుదీరిన దేవీమాత మండపం వద్ద ఆదివారం శ్రీ సార్వజనిక్ దేవి మాత ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సవ కమిటి అధ్యక్షులు సూర అనిల్, అమ్మవారి మలాదారులు, గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు, భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్