నవీపేట్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి బైక్ చోరి

59చూసినవారు
నవీపేట్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి బైక్ చోరి
నవీపేట్ పోలీస్ ఠాణా వద్ద నుంచి ఓ వ్యక్తికి చెందిన బైక్ చోరీకి గురి అయిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. కుమ్మరి కాలనీకి చెందిన మల్లేష్ ఇంట్లో గురువారం రాత్రి చొరీ జరిగింది. ఆయన మోటార్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లారు. తిరిగి బయటకు వచ్చే సరికి బైకు కనిపించకపోవడంతో బాధితుడు కంగు తిన్నాడు. తిరిగి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్