బస్సుల సంఖ్యను పెంచాలని బోధన్ బస్ డిపో ఎదుట ధర్నా

55చూసినవారు
బస్సుల సంఖ్యను పెంచాలని బోధన్ బస్ డిపో ఎదుట ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూ బస్సుల సంఖ్యను పెంచాలని బోధన్ ప్రగతిశీల మహిళా సంఘం కమిటీ ఆధ్వర్యంలో బోధన్ బస్ డిపో ఎదుట ధర్నా చేశారు. అనంతరం డిపో సిబ్బందికి వినతి పత్రాన్ని సమర్పించారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నందున ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్