చందూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వ్యవసాయదారులు తమ పంట పొలాల్లో చీడపీడల నాశనానికి డ్రోన్ సహాయంతో మందును పిచికారి చేస్తున్నారు. దీని ద్వారా సమయం, కూలి డబ్బులు ఆదా అవుతున్నాయని, సమయానికి కూలీలు దొరకడం లేదని రైతన్నలు తెలుపుతున్నారు. ఇకనుండి రైతన్నలు తమ పొలంలో ఏ మందు పిచు కారి చేయాలన్న డ్రోన్ ల పై ఆసక్తి చూపుతున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా రైతన్నలు మారక తప్పడం లేదంటున్నారు.