బోధన్ నియోజకవర్గం రెంజల్ మండలంలో మంగళవారం సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చే మొదటి విషయం ముగ్గులు. ఇవి కేవలం రంగుల చిత్రాలు కావు, ఇవి సంస్కృతి, ఆచారాలకు అద్దం పడతాయి. సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉదయం నుంచి రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొస్తున్నారు. ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించుకునే మహిళలు ఈసారి కూడా అదే ఉత్సాహంతో రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు.