దోమకొండ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి
దోమకొండ గ్రామపంచాయతీ కార్యదర్శిగా యాదగిరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు పిట్లం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి గ్రామస్తుల, అధికారుల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. గ్రామ సమస్యలను దశలవారీగా పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారు. పార్టీలకతీతంగా గ్రామస్తులు అభివృద్ధికి సహకారం అందించాలని పేర్కొన్నారు.