ఇండల్వాయి: నిమజ్జనానికి బయలుదేరిన దుర్గాదేవి
ఇండల్వాయి గ్రామంలో నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఆదివారం దుర్గాదేవి నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవిమాతకి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు మంగళహారతులతో, పిల్లలు దాండియా ఆడుతూ, యువత డీజే పాటలతో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.