
నిజామాబాద్: యువకుడు ఆత్మహత్య
జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాండ్ల శ్యామ్ కు గత కొద్దిరోజులుగా మానసిక పరిస్థితి బాగాలేదు. ఈ క్రమంలో అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.