Dec 23, 2024, 06:12 IST/
పెళ్లికి రూ. 5,000 కోట్ల ఖర్చు.. స్పందించిన జెఫ్ బెజోస్
Dec 23, 2024, 06:12 IST
ప్రపంచ కుబేరుడు రెండోసారి వివాహానికి సిద్దమైన విషయం తెలిసిందే. రూ.5000 కోట్లు ఖర్చు చేసి తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను డిసెంబర్ 28న పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా సంస్థల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా ఈ వార్తలపై బెజోస్ తాజాగా స్పందించారు. పెళ్లికి 600 మి.డా ఖర్చు చేస్తున్న మాట అవాస్తమని తేల్చి చెప్పారు. అవన్నీ అసత్య ప్రచారాలే. చదివేవన్నీ నిజం కావని అనేందుకు ఇదో ఉదాహరణ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.