AP: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పేర్ని నాని కుటుంబంపై నోటీసులు జారీ చేయగా.. పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాగా, రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని కుటుంబం గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉంది. పోలీసుల నోటీసులపై పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు, భార్య జయసుధ స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.