టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎ: రేవంత్ రెడ్డిని కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి రాగానే సీఎంను కలవడంపై నిర్ణయం తీసుకుంటామని నిర్మాత నాగవంశీ తాజాగా మీడియాకు తెలిపారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కారణంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే.