నవీపేట మండలం - Navipet Mandal

వీడియోలు


నిజామాబాద్ జిల్లా
పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం
Oct 04, 2024, 01:10 IST/

పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం

Oct 04, 2024, 01:10 IST
TG: సైదాబాద్‌ ప్రాంతంలోని ఓ పునరావాస కేంద్రం నుంచి గత నెల 24న ఇద్దరు బాలికలు పారిపోయారు. బస్సులో జనగామకు చేరుకున్న ఆ బాలికలు ఓ యువకుడిని ఫోన్‌ అడిగి తెలిసిన వారికి ఫోన్‌ చేయగా వారు రాలేదు. దీంతో వారికి ఫోన్‌ ఇచ్చిన యువకుడు తమకు ఆశ్రయం ఇస్తానని తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి ఆ బాలికలపై అత్యాచారం చేశాడు. మర్నాడు ఇతర స్నేహితులతో కలిసి కారులో మళ్లీ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైదాబాద్‌ పోలీసులు ఐదుగురు యువకులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.