నవీపేట మండలం - Navipet Mandal

వీడియోలు


నిజామాబాద్ జిల్లా
వేల్పూర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న జీవన్ రెడ్డి
May 08, 2024, 09:05 IST/

వేల్పూర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న జీవన్ రెడ్డి

May 08, 2024, 09:05 IST
బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి స్థానిక నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చేరిన బిజెపి, బీఆర్ఎస్ నాయకులకు జీవన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఏ అభివృద్ధి అయినా, సంక్షేమ పథకమైన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టులో భాగమైన 21 ప్యాకేజీ పనులు పూర్తి చేయలేక పోవడంతో సాగునీరు అందలేదన్నారు. రీడిజన్ పేరుతో పనుల్లో మరింత జాప్యం చేశారు. రైతులు పదేళ్ల నుండి ఏటా రెండు పంటలు కోల్పోయారు. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు అయిన ప్రశాంత్ రెడ్డి పదేళ్ల నుండి 21 ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తి చేయించలేకపోయారు అని నిలదీశారు. ఏడాది కాలంలో 21 ప్యాకేజీ పనులు పూర్తిచేసి సాగు నీరు అందించే బాధ్యత నాది అని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అరవింద్ ఐదేళ్ల కాలంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. నిజాంబాద్ పార్లమెంటును కవిత అభివృద్ధి చేయలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రాజకీయాలకతీతంగా గత ఎన్నికల్లో అరవింద్ కు మద్దతు తెలిపి గెలిపిస్తే ఐదేళ్ల కాలంలో అరవింద్ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. అరవింద్ పసుపు బోర్డ్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఐదేళ్లు గడుస్తున్నప్పటికి పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు. వరికి ప్రత్యామ్నాయమైన పంట చెరుకు సాగుకు మద్దతుగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీని 2015లో టిఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసింది. చక్కెర కర్మగారాలు సహకార రంగంలో ఏర్పాటు చేస్తే రైతులపై మరింత భారం పడుతుందన్నారు. చక్కెర కర్మగారాలు పునరుద్ధరించాలని ప్రతి శాసన సభ మండల సమావేశాలు మాట్లాడిన అని గుర్తు చేశారు. రైతులపై భారం పడకుండా చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ నిర్వహణలో చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని, చక్కర కర్మగారాలు పునరుద్ధరించేందుకు మంత్రివర్గ సంఘం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేసే పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్తు అందజేస్తుంది. బిజెపి పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారా చెప్పాలన్నరు. కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు రు.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. జీవితంలో చివరికి వచ్చిన.. ఆదరించండి.. ఆశీర్వదించండి.. ఎంపిగా గెలిపించండి అని జీవన్ రెడ్డి అభ్యర్థించారు.