Oct 14, 2024, 16:10 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
Oct 14, 2024, 16:10 IST
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ తోపాటు నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.