నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

83చూసినవారు
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
ఆటోలో ప్రయాణించిన వ్యక్తి పొరపాటున వదిలేసిన నగదు బ్యాగును తిరిగి తీసుకువెళ్లి అప్పగించడం ద్వారా ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. సోమవారం వెల్మల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 11500 నగదు, 4 గ్రాములు బంగారంతో కూడిన బ్యాగ్ ఆటోలో మరచిపోయారు. తరువాత ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ గూండ్ల పోశెట్టి ఆ నగదు బ్యాగును వెంటనే వెల్మల్ గ్రామానికి వెళ్లి అప్పగించాడు. దీనితో ఆలూర్ గ్రామస్తులు పోశెట్టి నిజాయతీని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్