నిజామాబాద్: డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో శనివారం విద్యార్థినులకు అందించిన అల్పాహారంలో బల్లి ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 'ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా పురుగులు చాలాసార్లు వచ్చాయి. మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన మళ్లీ ఇలా జరగడం అధికారుల నిర్లక్ష్యం.' బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునఃరావృతం కాకుండా చూడాలని విద్యార్థినులు కోరారు.