పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు అందజేయాలి

56చూసినవారు
పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు అందజేయాలి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఐదు నెలల నుండి బిల్లులు చెల్లించడం లేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల బిల్లులు చెల్లించలని అన్నారు. ఈ ధర్నాలో తోపునూరు చక్రపాణి, నాగలక్ష్మి, కవిత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్