
నిజామాబాద్: నల్ల బ్యాడ్జీలతో ఆశా వర్కర్ల నిరసన
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశాలకు 18 వేల ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.