Aug 29, 2024, 17:08 IST/
ఎఫ్టిఎల్ లో నిర్మాణాలకు అనుమతినిచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసుల నమోదుకు 'హైడ్రా' సిద్దం
Aug 29, 2024, 17:08 IST
ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడుతూనే అనుమతులు ఇచ్చిన అధికారులపై వేటు వేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కు హైడ్రా సిఫారసు చేసింది. ఈ జాబితాలో జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, బాచుపల్లి ఎమ్మార్వో సహా ఓ సర్వేయర్ ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.