నిజామాబాద్: నగరంలోని ఫుట్ పాత్ పై ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్లపై కూరగాయలు, తోపుడు బండ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని, వీధి వ్యాపారులను రైతు బజార్లలోకి తరలించి దుకాణాలను కేటాయించాలని సూచించారు.