
నిజామాబాద్: ప్రజావాణికి 82 ఫిర్యాదులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలియజేశారు. అట్టి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.