రియాక్టర్‌ పేలడం వల్ల కాదు.. సాల్వెంట్‌ లీకవడం వల్లే..

52చూసినవారు
రియాక్టర్‌ పేలడం వల్ల కాదు.. సాల్వెంట్‌ లీకవడం వల్లే..
అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఫ్యాక్టరీస్‌ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. రియాక్టర్‌ పేలడం వల్ల కాదని.. సాల్వెంట్‌ లీకవడం వల్లే ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్‌ విభాగం డైరెక్టర్‌ చంద్రశేఖరవర్మ తెలిపారు. ‘రియాక్టర్‌లో తయారైన మిథైల్‌ టెర్ట్‌- బ్యుటైల్‌ ఈథర్‌ మిశ్రమాన్ని స్టోరేజీ ట్యాంకులోకి మార్చే సమయంలో లీకై ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు సంభవించింది‘ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్