నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

78చూసినవారు
నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
వర్షాభావ పరిస్థితులతో తిరుమలలో డ్యాంలు ఎండిపోతున్నాయని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది. రిజర్వాయర్లలో 130 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వ ఉందని తెలిపింది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నీటి వృథాను నివారించాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలలో రోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్