భార్య, పిల్లల కళ్ల ముందే NRI దారుణ హత్య (వీడియో)

4908చూసినవారు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ పరిధి డాబుర్జి గ్రామంలో శనివారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. అమెరికాకు చెందిన ఎన్నారై సుఖ్‌చైన్ సింగ్‌ ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. భార్య, పిల్లలు చూస్తుండగానే సుఖ్‌చైన్ సింగ్‌ను వారు తుపాకీతో కాల్చి హత్య చేశారు. సుఖ్‌చైన్‌ను వదిలేయాలని అతడి భార్య, పిల్లలు ప్రాధేయపడ్డా దుండగులు కనికరించలేదు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్