ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. 3 నెలల లాకిన్ పీరియడ్ ముగియటంతో 7% పైగా క్షీణించి రూ.75.08 వద్ద ట్రేడవుతున్నాయి. IPOకి వచ్చిన కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లపై లాకిన్ పీరియడ్ విధిస్తుంది. గడువు ముగిసేవరకు ఈ షేర్లను ట్రేడ్ చేయటానికి వీలుండదు. కాగా, రూ.72-76 ధరల శ్రేణితో IPOకి వచ్చిన ఓలా రూ.76 వద్ద ట్రేడింగ్ ప్రారంభమై.. గరిష్టంగా రూ.157.40కి చేరింది.