పోర్టబుల్‌ బ్యాటరీతో రూ.39 వేలకే ఓలా కొత్త స్కూటర్‌

75చూసినవారు
ఓలా ఎలక్ట్రిక్‌ తన వాహన శ్రేణిని మరింత విస్తరించింది. గిగ్‌, ఎస్‌1 జడ్‌ శ్రేణిలో కొత్త స్కూటర్లను లాంచ్‌ చేసింది. గిగ్‌ శ్రేణిలో ఓలా గిగ్‌, ఓలా గిగ్‌+ స్కూటర్లను ప్రకటించింది. వీటి ధరలు రూ.39,999, రూ.49,999గా నిర్ణయించింది. ఎస్‌1 జడ్‌ స్కూటర్‌ ధరను రూ.59,999గా, ఎస్‌1 జడ్‌+ స్కూటర్‌ ధరను రూ.64,999గా నిర్ణయించింది. రూ.499 చెల్లించి నేటి నుంచే వీటిని బుక్‌ చేసుకోవచ్చని ఓలా తెలిపింది. వీటి డెలివరీ మే నుంచి ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్