లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్‌గాంధీని ఒలింపిక్ విజేత మను భాకర్ కలిశారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. పారిస్ నుంచి వచ్చిన మను భాకర్ ఇటీవల సోనియాగాంధీని కలిశారు. తను సాధించిన పతకాలను చూపించారు. తాజాగా శుక్రవారం తల్లిదండ్రులతో కలిసి ఆమె పార్లమెంట్ హౌస్‌లో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీనే స్వయంగా ఆమెను పూలబొకేతో ఆహ్వానించి స్వీట్ అందించారు.