కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్‌కేఐసీసీ)లో జరిగాన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ఒమర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.