తెలంగాణలో దగా పాలనకు ఏడాది పూర్తవుతోందని కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఎక్స్ వేదికగా.. 'నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట? ఏడాది పాలనలో రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? కాంగ్రెస్ పాలనలో.. ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా? రేవంత్ ఏడాది ఏలికలో రైతుకు గోస తప్ప.. భరోసా లేనే లేదు. చేతకాని హామీలు ఇవ్వడమెందుకు? అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకు?' అని ప్రశ్నించారు.