మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో ఆ పార్టీలు పీహెచ్‌డీ చేశాయంటూ విమర్శించారు. భాజపా, శివసేన, ఎన్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మహారాష్ట్రలో 12 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, అలాగే 100 రైల్వే స్టేషన్లను ఆధునీకరించామన్నారు. హస్తం పార్టీ కుట్రను భగ్నం చేసేందుకు అందరం ఐక్యంగా ఉందామని పిలుపునిచ్చారు.