చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం మంచిది. కొన్ని పప్పులు, గింజలను తినడం వల్ల సీజనల్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, బాదం పప్పు, వేరుశెనగలు తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.