ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. 'ప్రజలకు ఏం అవసరమో.. మనం చేసింది చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక లాంటిది. అసెంబ్లీలో తమ ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. బూతులు మాట్లాడితే ప్రజలు స్వాగతించరు. గతంలో ఇదే జరిగింది' అని చంద్రబాబు సూచించారు.