హైదరాబాద్ మధురానగర్‌లో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. 'ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రావు. మా ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంది.' అని రంగనాథ్ తెలిపారు.