అక్టోబర్ నెలలో ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో)కు చెందిన కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ) సమావేశానికి హాజరు కావాలని భారత ప్రధాని మోదీని పాకిస్తాన్ ఆహ్వానించిందని రిపోర్ట్స్ తెలిపాయి. అయితే మోదీ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని, భారత ప్రతినిధిగా విదేశాంగ మంత్రిని పంపే అవకాశం ఉందని సమాచారం. 2023లో జరిగిన సమావేశానికి కూడా మోదీకి బదులుగా జైశంకర్ హాజరయ్యారు.