రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ఆరావళి పర్వత శ్రేణుల్లో ఇడాన్ అమ్మవారి ఆలయం ఉంది. నెలలో రెండు మూడు సార్లు ఈ ఆలయం అగ్ని కీలల్లో చిక్కుకుంటుంది. ఆలయమంతా అగ్నికి ఆహుతైనా అమ్మవారి విగ్రహం మాత్రం చెక్కు చెదరదట. అయితే ముఖ్యంగా పక్షవాత రోగులు, మతిస్థిమితం లేని వారు, డిప్రెషన్‌తో బాధపడేవారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే.. తప్పక ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుందట. ఇంకా ఈ ఆలయంలో త్రిశూలాన్ని దర్శించుకుంటే.. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.