TG: హైదరాబాద్కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి సూసైడ్ కేసును పోలీసులు ఛేధించారు. రసూల్పూరకు చెందిన స్రవంతి ఈనెల 11న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే తన అన్న భార్య శైలజతో నవీన్ కుమార్కు వివాహేతర సంబంధమున్నట్లు స్రవంతి గుర్తించడంతో, వీరిరువురు కలిసి శైలజను వేధించారు. దీంతో మనస్థాపానికి గురైన శైలజ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.