ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్

77చూసినవారు
ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ‘‘తెలుగు నుడికారానికి, తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో మన ఎన్టీఆర్‌ ఒకరని తెలుగువారు గర్వంగా చెప్పుకోవచ్చు. సమాజంలో మార్పు కోసం ఆయన తెచ్చిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోయాయి’’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్