జనసేన గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లినా పవన్ కుంగిపోలేదు. ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపించింది. బీజేపీతో మంచి సంబంధాలున్న పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కీలక భూమిక పోషించారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో వైసీపీని చిత్తు చేశాయి. నాడు పవన్‌ను రెచ్చగొట్టిన వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.