సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారట. ఈ కేసులో అరెస్టైన బన్నీకి తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.