AP: పండగపూట రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా వినుగొండ మండలంలో పల్లె వెలుగు బస్సు బీభత్సం సృష్టించింది. అందుగుల కొత్తపాలెం వద్ద గొర్రెల కాపరి, గొర్రెలపై దూసుకెళ్లింది. గొర్రెల కాపరి తిరుపతయ్య, 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 20 గొర్రెలు గాయపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది.