ఆదాయ వనరుగా ప్లాస్టిక్ వ్యర్థాలు

71చూసినవారు
ఆదాయ వనరుగా ప్లాస్టిక్ వ్యర్థాలు
చార్‌ధామ్ యాత్ర నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈక్రమంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో అధికారులు 'యాంటీ వేస్ట్ డ్రైవ్‌‌'లను నిర్వహించారు. 3 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి విక్రయించడం ద్వారా జోషిమఠ్‌ మున్సిపాలిటీకి రూ.1.02 కోట్ల ఆదాయం వచ్చింది. పర్వతాలకు సమస్యగా మారుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

సంబంధిత పోస్ట్