హిందూ ఆలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ

83చూసినవారు
హిందూ ఆలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ
కెనడాలోని హిందూ ఆలయంపై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. కెనడాలో భారత దౌత్యవేత్తలను బెదిరింపులకు గురిచేసే పిరికిపంద యత్నాలు మరింత భయంకరమైనవిగా పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్‌ స్థైర్యాన్ని ఏమాత్రం బలహీనపరచలేవన్నారు. కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్