భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు నివాళి అర్పించారు. ప్రస్తుతం మన్మోహన్ పార్థివదేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. శనివారం మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి.