మనీందర్ కౌశిక్ అనే రెసిడెంట్ డాక్టర్ తనను కిడ్నాప్ చేసి శారీరకంగా వేధించాడంటూ హర్యానాలోని రోహతక్ లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PGIMS)లో చదువుతున్న దంతవైద్య విద్యార్థిని ఆరోపించింది. ఆ విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వైద్యుడిని ఇన్స్టిట్యూషన్ నుంచి బహిష్కరించారు.