కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు సోమవారం సీల్దా కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ క్రమంలో అతడు వేసే కేకలు అక్కడి మీడియాకు వినిపించకుండా పోలీసులు హారన్లు కొట్టారు. ఈ విధంగా జర్నలిస్టులు అతని గొంతు వినకుండా నిరోధించే ప్రయత్నం చేశారు. కాగా, మునుపటి విచారణలో మీడియా కనిపించగానే.. తనను ఇరికించారంటూ సంజయ్ రాయ్ కేకలు వేసిన విషయం తెలిసిందే.