బెంగళూరుకి చెందిన ఓ మహిళ కార్ డ్రైవింగ్, లాప్‌టాప్‌లో వర్క్ చేస్తు వీడియో సోషల్ మీడియాలో వైరలైయింది. ఇది చూసిన కొంతమంది వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరలై ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడింది. దీంతో వారు సదరు మహిళను ట్రాక్ చేసి రూ.1000 ఫైన్ విధించారు. దీనిపై స్పందించిన ట్రాఫిక్ డీసీపీ 'వర్క్ ఫ్రమ్ హోం అనేది ఇంట్లో కూర్చొని చేయాలి. కారులో కూర్చుని చేసేది’ కాదంటూ 'X ' లో పోస్ట్ చేశారు.