పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగా ఉంది. 88 ఏళ్ల పోప్ ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. పరీక్షల అనంతరం ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు ఆయనకు రక్తాన్ని మార్చారు. అయినా పోప్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.